ఇప్పుడంటే ఆలోచనా తీరు మారిపోయిందేమో కానీ ఒకప్పడు అర్ధాంగంటే ఇలా ఉండాలి అతనిదెంత అదృష్టం అని అనిపించేలా అందం అణుకువ తొణికిసలాడే అపురూప లావణ్యవతి పాత్రలో శ్రీదేవి మెప్పించిన ఈ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కార్తీక దీపం (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు, జానకి
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...
చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...
నింగి సాక్షి.. నేల సాక్షి.. నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు
వేడుకలోను.. వేదనలోను... పాలూ తేనెగ ఉందాము
నీ కౌగిలిలో తల దాచి... నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే... వరమే నన్ను పొందనీ

2 comments:
ఈ మూవీ లో శ్రీదేవి చివర చనిపొయినపుడు మా అక్క వీరాభిమాని కావడంతో మూవీ చూస్తూ యేడ్చేసింది..అప్పట్లో తనని చూసి నవ్వినా..మొన్న ఆ పాట వేస్తే మాకూ కళ్ళలో నీళ్ళు వచ్చాయండి..
ఆ సినిమా ఏమో కానీ శ్రీదేవి అకాలమరణానికి బాధపడని హృదయం ఉండి ఉండదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.