క్షణం క్షణం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటలో శ్రీదేవి డాన్స్ చాలా బాగుంటుంది తనని చిత్రీకరించడంలో వర్మ తన అభిమానమంతా చూపించాడనిపిస్తుంటుంది. పాట బీట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపుల తెలిపెను కథ పిలుపుల మలుపులలో
ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు
చిలికిన చినుకులలో తొలకరి చిరుజల్లులలో
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
చిత్రం : క్షణం క్షణం (1991)
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : నాగుర్ బాబు(మనో), చిత్ర, డా.గ్రబ్
శ్రావణ వీణ... స్వాగతం...
స్వరాల వెల్లువ వెల్ కమ్
లేత విరిబాల నవ్వమ్మా ఆ...నందంలో..
జుంబాయే హాగుంబహేయ జుంబాయే ఆగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
వయసాగనిది రేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహే
అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే హే..హే..
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపుల తెలిపెను కథ పిలుపుల మలుపులలో
ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు
చిలికిన చినుకులలో తొలకరి చిరుజల్లులలో
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
2 comments:
డాలియాలు కూడా అమ్మాయిలకి ఇంత అందాన్నిస్తాయని శ్రీదేవిని చూశాకే అర్ధమైంది..నిజంగా ఓ అమ్మాయిని ఆరాధించడమంటే ఆమె అభిమతాన్ని గౌరవించడం అని నమ్ముతాను నేను..ఆర్.జి.వి శ్రీదేవిని గురించి వేసిన పోస్ట్ చాలా చిరాకుని కలిగించింది..తనొక అతిలోక సుందరిగా..అద్భుతమైన నటిగా మిగిలిపోవాలన్న ఆమె ఆకాంక్షని గౌరవించడమే ఆమెకి నిజమైన్ ట్రిబ్యూట్ అనిపిస్తుంది నాకు..యే భాషలో ఎంటర్ ఐతే అక్కడ నంబర్ వన్ గా గుర్తింపు పొందడమనేది ఇప్పడివరకూ యెవరూ సాధించని విజయం..పాజిటివ్ గా ఆలోచిస్తే..ఆమెలోని ఆ డెడికేషన్, డిటర్మినేషన్ నేటి అమ్మాయిలకీ, అబ్బాయిలకీ..అందరికీ కూడా ఓ గొప్ప స్ఫూర్తి..
శ్రీదేవి గురించి మీరు చెప్పిన విషయాలు చాలా కరెక్ట్ శాంతిగారు.. చాలామంది హీరోలకి కూడా సాధ్యమవలేదు ఆ ఫీట్.. తను నటించిన ప్రతి భాషలోనూ నంబర్ వన్ అవడం నిజంగా శ్రీదేవికి మాత్రమే దక్కిన క్రెడిట్. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.