శనివారం, మార్చి 03, 2018

కథగా కల్పనగా...

శ్రీదేవి గురించి కానీ సినిమా మొదలు తుది కానీ తెలియని వారెవరైనా ఆ సీన్స్ చూసినపుడు ఈ అమ్మాయ్ నిజంగా మెదడు ఎదగని చిన్నపిల్లేనేమో అని అనుకునేంత అద్భుతంగా నటించి మెప్పించిన చిత్రం వసంత కోకిల. ఈ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట హిందీలో ఏసుదాసు గారి గొంతులో నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అది ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : వసంత కోకిల (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

సినిమా చివరిలో వచ్చే మూడవ చరణం..

ఎవరికి ఎవరో ఎదురవుతారూ..
మనసూ మనసూ ముడిపెడతారూ..
ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో..
బ్రతుకే రైలుగా సాగేనటా.. నీతో నువ్వే మిగిలేవటా..

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా.. ఆమని విరిసే తోటగా
లాలిజో జోలాలిజో ... లాలిజో జోలాలిజో
 

2 comments:

బాలూమహేంద్రగారు, కమల్ హసన్, శ్రీదేవి, ఇళయరాజాగారు, బాలు గారు...అందరూ మహామహులే....

అవును శాంతి గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.