శనివారం, మార్చి 10, 2018

తొంగి తొంగి చూడమాకు...

శ్రీరంగనీతులు చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీరంగ నీతులు (1983)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

హె... హె... హే.. లలలలా..
హె.... హె... హే.. లలలలా..

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా
వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా
అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

వెన్నెల్లో వేడుకుంది
కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది
వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా
పూల బాణాలు వేసుకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
పూల బాణాలు వేసుకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
కలిసే ఉందామా కరిగే పోదామా
చుప్పనాతి చుక్కల్ని దాటుదామా
చూడలేని చంద్రుణ్ణి తరుముదామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

గుండెల్లో తాళముంది
గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది
ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపి తాపాలలో తేలిపోదమా?
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపి తాపాలలో తేలిపోదమా?
స్వర్గం చూద్దామా...  సొంతం చేద్దామా
మత్సరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా
వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా
అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
  


2 comments:

ఈ పాట యెవర్నైనా యేడిపించడానికి పాడే వాళ్ళం..

హహహ సూపర్ హిట్ అయిన పాట కదండీ మరి... థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.