అన్నగారి అభిమానులు ఒప్పుకోరేమో కానీ కేవలం శ్రీదేవి వల్లే వేటగాడు సినిమాలోని ఈ పాట సూపర్ హిట్ అయిందనడంలో ఏ సందేహం లేదు అనిపిస్తుంది. వానపాటల అభిమానుల గుండెలయతప్పించిన ఆ పాటేదో మీరూ చూసేయండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మ చాటు పువ్వు తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మ చాటు పువ్వు తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
అహ అహ .. అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి ..అహ
జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ .. అహా అహ అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ .. నీ పాట విని మెరుపులొచ్చి... అహ
నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి

ఆకు చాటు పిందె తడిసే.. ఆహా అహా అహా అహా
కొమ్మచాటు పువ్వు తడిసే.. ఆహా అహా అహా అహా
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మచాటు పువ్వు తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
2 comments:
క్లాస్ నీ మాస్ నీ ఊపేసిన పాట..
హహహ నిస్సందేహంగా శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.