బంగారు బావ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బంగారు బావ (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
మల్లికా ఆ....
మల్లికా... నవ మల్లికా
మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా... నవ మల్లికా
మదనోత్సవ సంగీత సంచిక
రగిలే వేసవి రాగమాలికా
మధుర శరదృతు మౌనగీతికా
రగిలే వేసవి రాగమాలికా
మధుర శరదృతు మౌనగీతికా
ప్రేమిక మానస లగ్నపత్రిక
పులకింతల తొలి చూలు పుత్రికా
మల్లికా ఆ....ఆ..ఆ..
యలమావులలో విరితావులలో
మనసున కోయిలలెగసే వేళ
వయసంతా వసంత గానమై
జనియించిన యువ కావ్య కన్యక
మరులు గొలుపు మరుని బాణ దీపిక
మల్లికా ఆ....ఆ..ఆ..
తొలి కోరికలే అభిసారికలై
వలపుల కౌగిట బిగిసేవేళా
తొలి కోరికలే అభిసారికలై
వలపుల కౌగిట బిగిసేవేళా
ఆ సొగసే అమృతాభిషేకమై
ఆ సొగసే అమృతాభిషేకమై
తనియించిన భువిలోన తారకా
మనసు తెలుపు తెలుపు
నీదే మల్లిక...నా చంద్ర కైతిక
మల్లికా.. నవమల్లికా
మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా.. ఆ..
2 comments:
ఈ కాలానికి(వేసవి) సరైన పాట..పిక్ అద్భుతం..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.