బుధవారం, మార్చి 07, 2018

బంగినపల్లి మామిడి పండు...

కొండవీటి సింహం చిత్రంలోని ఒక హుషారైన పాటని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొండవీటి సింహం (1981)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : బాలు, పి.సుశీల

బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
అది ఏ తొటదో ఏ పేటదో
అది ఏ తొటదో ఏ పేటదో

బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది
బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది
ఇది నీ కొసమే పండిందిలే
ఇది నీ కొసమే పండిందిలే


పెదవులా రెండు దొండపళ్ళూ
చెక్కిళ్ళా చక్కెరకేళి అరటి పళ్ళు
నీలికన్ను నేరేడు పండు
నీలికన్ను నేరేడు పండు
నిన్ను చూసి నా ఈడు పండు
పాలకొల్లు తొటలోన బత్తాయిలు
వలపుల్ల వడ్లమూడి నారింజలు
పాలకొల్లు తొటలోన బత్తాయిలు
వలపుల్ల వడ్లమూడి నారింజలు
కొత్తపల్లి కొబ్బరంటి చలి కోర్కెలు..
తొలి కాపుకొచ్చాయి నీ చూపులు
ఈ మునిమాపులో..


బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
ఇది నీ కొసమే పండిందిలే
ఇది నీ కొసమే పండిందిలే


పలుకులా తేనె పనసపళ్ళు
తళుకులా  పచ్చ దబ్బ పళ్ళు
నీకు నేను దానిమ్మ పండు
నీకు నేను దానిమ్మ పండు 
నిన్నుజేరి నా నోము పండు
అరె నూజివీడు సరసాల సందిళ్ళ లో
సరదా సపోటాల సయ్యాటలో
నూజివీడు సరసాల సందిళ్ళ లో
సరదా సపోటాల సయ్యాటలో
చిత్తూరు మామిళ్ళ చిరువిందులే
అందించుకోవాలి అరముద్దులు
మన సరిహద్దులో

బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది
ఇది నీ కొసమే పండిందిలే
ఇది నీ కొసమే పండిందిలే


బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
అది ఏ తొటదో ఏ పేటదో
అది ఏ తొటదో ఏ పేటదో 


2 comments:

బన్నీలా చెప్పాలంటే..ఊర మాస్..

హహహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.