ముత్తు చిత్రంలోని ఒక హుషారైన పాటతో ఈ మాస్ పాటల సిరీస్ ని ఈ రోజుతో ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ముత్తు (1995)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : మనో, సుజాత
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
హా...ముద్దు చాలే మీనా
అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసేనా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
పైట చెంగు పాడిందయ్యో పరువాల పాట
తట్టి తట్టి ముద్దోటిస్తే అదిరేను ఆట
కల్లాకపటమేది లేని జవరాలి పాట
పట్టె మంచమేస్తే ఇంక చెలరేగిపోదా
వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మ
కులాసాల సందిట్లో విలాసాల వేటమ్మా
పదారేళ్ళ ఒంపుల్లో మజా చేసుకుందామా
పదాలింక చాలించి పెదాలందుకుందామా
సడే లేని ముంగిట్లో సడే చేసుకుందామా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసేనా
ఎర్రపాటి కుర్రోళ్ళంతా ఎనకాల వుంటే
నల్ల పిల్లగాణ్ణే కోరి మనసివ్వనేల
నల్లనల్ల మేఘంలోనే నీరుంటదంట
నల్లవాడి గుండెల్లోన తల దాచుకుంటా
మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల
మందార పువ్వల్లె ఎర్రబారే సందేళా
చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటి ఈ వేళ
వెన్ను పట్టి ఏకంగా వెన్న దోచుకోవాలా
గట్టుదాటి గోదారాల్లె నిన్ను ముంచి వెయ్యాలా
తిల్లాన తిల్లాన నీ పెదవుల్లో తేనా
టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా
తిల్లాన తిల్లాన నీ పెదవుల్లో తేనా
టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ పెట్టెయ్ అన్నానా
కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసేనా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
2 comments:
క్లాస్ నీ మాస్ నీ కూడా అలరించిన పాట..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.