సోమవారం, ఫిబ్రవరి 05, 2018

శివ శివ అననేలరా...

భక్తకన్నప్ప చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం
సాహిత్యం : సినారె
గానం : జానకి

శివ శివ అననేలరా..
శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా..
కౌగిలిలో నే కైలాస మీయగా
శివ శివ అననేలరా

కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి

భక్తులకు బ్రతుకు గడుపగా.. గడుపగా.. ముక్తి
మనబోటి రక్తులకు.. సనిద నిదప గా మా పా
మనబోటి రక్తులకు.. సగమా గమద మనిద మదప
మనబోటి రక్తులకు... ఘడియ ఘడియకు.. ముక్తీ
శివ . . శివ   
 
శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా
కౌగిలిలో నేకైలాస మీయగా
శివ శివ అననేలరా ... రా.. రా

టక్కరి మరుని ఉక్కడగించెను
నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను
నేటి నీ కొంటె చూపు

సగము మేనిలో మగువను నిలిపిన
సగము మేనిలో మగువను నిలిపిన
చంద్రధరుడు ఆ హరుడు
తనువు తనువె ఈ తరణి కొసంగిన
రసిక వరుడు.. ఈ హరుడు.. శివ.. శివ  

శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా
కౌగిలిలో నేకైలాస మీయగా..
శివ.. శివ.. శివ శివ అననేలరా.. రా.. రా..  రా

 

2 comments:

మడిసన్నాక కూసింత కలాపోషనుండాలన్నారు కదా మన బాపు రమణలు..

అంతే అంతే శాంతిగారు.. అన్నారుకదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.