మిర్చీ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మిర్చి (2013)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : దేవీశ్రీప్రసాద్, గీతామాధురి
నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసేమో గిల్లా గిల్లా కొట్టేస్కుంటాందే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
తొక్కమీద కాలేసి నీ ఒళ్లో పడ్డట్టు
మస్తు మస్తు సీనే రాతిరి కల్లోకొచ్చిందే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
సచ్చిను బ్యాటే తెచ్చి నన్ను సిక్సరు పీకేసినట్టు
బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే
రబ్బరు మూతే పెట్టి గాజుసీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తోంది రారో డార్లింగే
ఎహె చేసిన వెయిటింగ్ చాల్లే
ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే బెగిరారో డార్లింగే
నువ్వో చిచ్చుబుడ్డి నేనో అగ్గిపుల్లా
రాయే పిల్లా మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తిపీట నేనేమో యాపిలంటా
నీ పర పరా చూపులకోత నాకూ ఇష్టమంటా
గల్ఫు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నావే
ఒంటి నిండా చల్లేస్కుంటా రాయే డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి
ప్రేమగా పెంచుకుంటా రారో డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే బెగిరారో డార్లింగే
జెళ్లో తురుముకున్న మల్లెపూలదండే నలిగి
విలా విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం విరిగి
గొల్లుమనే టైము తొందర్లోనే రానున్నాదే బేబీ
ఉట్టిమీది బొబ్బట్టు నోటిలోన పడ్డట్టు
ఆవురావురంటూ ఏదో చేసెయ్ డార్లింగే
కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు
టేస్టే చూసేస్కుంటా వొచ్చెయ్ డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే బెగిరారో డార్లింగే
2 comments:
అనుష్కా..ఈ అమ్మాయి యెలా ఉన్నా..మూవీ చెస్తే (బాగ్మతి)హిట్టే మరి..
మరే అలాంటి సినిమాలు ఎన్నుకుంటుందండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.