మంగళవారం, ఫిబ్రవరి 06, 2018

ఏం మొగుడో ఎం మొగుడో...

రాథాకళ్యాణం చిత్రంలోని ఒక హుషారైన పాట విందామీరోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధా కళ్యాణం (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం :
గానం : సుశీల

ఏం మొగుడో..
ఏం మొగుడో ఎం మొగుడో
వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో
తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో

ఏం మొగుడో ఎం మొగుడో
వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో
తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో


రెండు ఝూములదాకా ఎండైనా వానైనా
చాకిరేవునీ తెగ ఏలుతాడు
రెండు ఝూములదాకా ఎండైనా వానైనా
చాకిరేవునీ తెగ ఏలుతాడు
పొద్దువంగిందంటే బుద్ధీ మళ్ళిందంటే
పొద్దువంగిందంటే బుద్ధీ మళ్ళిందంటే
కల్లు పాకలో మునిగి తేలుతాడు

ఏం మొగుడో ఎం మొగుడో
వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో
తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో


మత్తు నెత్తికెక్కి మద్దెరేతిరి వచ్చి
బండబూతులేవేవో ఇప్పుతాడు
మత్తు నెత్తికెక్కి మద్దెరేతిరి వచ్చి
బండబూతులేవేవో ఇప్పుతాడు
తెల్లారిపోగానే కల్లారిపోగానే
తెల్లారిపోగానే కల్లారిపోగానే
తీయన్ని సుద్దులెన్నో సెప్పుతాడు

ఏం మొగుడో ఎం మొగుడో
వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో
తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో


ఎన్నెన్ని తిట్టినా ఎంతెంత కొట్టినా
ఏమైనా వీడు తాళికట్టినోడూ
ఎన్నెన్ని తిట్టినా ఎంతెంత కొట్టినా
ఏమైనా వీడు తాళికట్టినోడూ
ఇరుగమ్మలేమన్నా పొరుగమ్మలేమన్నా
ఇరుగమ్మలేమన్నా పొరుగమ్మలేమన్నా
సచ్చినోడు నాకు నచ్చినోడు

ఏం మొగుడో ఎం మొగుడో
వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో
తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో 

 

2 comments:

తెల్లారిపోగానే కల్లారిపోగానే ..భలే పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.