ఊసరవెల్లి చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఊసరవెల్లి (2011)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : ముఖేష్, సుచిత్ర
హే జాతరలో జీన్సు వేసుకున్న బుట్టబొమ్మలా
రాతిరిలో సబ్బు రాసుకున్న చందమామలా
ఇస్తరిలో నంజుకున్న ఆవకాయ గుమ్మలా
ఎడాపెడా ఎగాదిగా ఏమున్నావే కోమలా
రావే చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా హే
రావే చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా ఓయ్
మాటలతో పేలుతున్న కుర్రనాటు బాంబులా
చూపులతో కాలుతున్న పెట్రోమోక్సు బల్బులా
ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్సఫార్మర్ బాక్సులా
ఎడా పెడా ఎగా దిగా ఉన్నావు యమ దొంగలా
రారా చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా
రారా చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా
హే రాజమండ్రిలో నన్ను చూసి
తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే
హే హే రాజహంశలా నువ్వలాగ నడిచొస్తే
టెంత్ పోరెడైనా పెన్ను కదుపులే
హే వైజాగ్ బీచ్ రోడ్ లో వెళ్తుంటే
నాకు వెయ్యి లవ్వు లెటురులే
why not ఇంత ఫిగరుకి వెయ్యి కాదు
లక్షొచ్చిన తప్పులేదులే
అసలింత రేంజ్ లో నా అందం ఉన్నదా
నమ్మాలనిపిస్తుంది నివ్విట్టా ఎత్తేస్తుంటే
రారా చేద్దాం దాండియా జరా
ఊగిపోదా ఇండియా
రావే చేద్దాం దాండియా జరా
ఊగిపోదా ఇండియా
హే అర్దరాతిరి నీ రోడ్ లో పవరు పోతే
చీకటుండదంట నువ్వు నవ్వితే నవ్వితే నవ్వితే
హే ఆపరా మరి ఎన్ని మాయ మాటలైనా
తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే తవ్వితే తవ్వితే
లిల్లీ సన్నజాజికే నీ లేత ఒళ్ళు వల్ల క్రేజు తగ్గెలే
సిల్లీ ఊసులమల్లే అనిపిస్తూనే
ఐసుచేసి ముంచుతావులే
పదివేల టన్నుల పరువాల వెన్నెల
ముందే ఉంటే పొగడకుండేది ఎలా ఎలా
రావే చేద్దాం దాండియా జరా
ఊగిపోదా ఇండియా హొయ్
రారా చేద్దాం దాండియా జరా
ఊగిపోదా ఇండియా ఇండియా
ఓయే ఓయే ఓయే అహా అహా
ఓయే ఓయే ఓయే అహా అహా
2 comments:
దేవి ఇలా మ్యూజిక్ చేస్తుంటే మరి ఊగిపోదా ఇండియా..
అంతేకదండీ మరి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.