శనివారం, ఫిబ్రవరి 10, 2018

అదరగొట్టు కొట్టు కొట్టు...

కృష్ణ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణ (2008)
సంగీతం : చక్రి
సాహిత్యం : చంద్రబోస్
గానం : శివాణి, వాసు

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్నే

మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్నే
 
 నా చెంపలు నిమిరెయ్యవా చెవి రింగువై
నా గుండెలుతడిమెయ్యవా ఓ గొలుసువై
నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వై

నీ చీకటి కరిగించనా కొవొత్తినై
నీ భయమును తొలిగించనా తాయతునై
నీ గదిలో వ్యాపించనా అగరత్తి నేనై
వేలే పట్టెయ్ ఉంగరమయ్యి
నాతో తిరిగెయే బొంగరమయ్యి
ఒళ్ళే మోసెయ్ పల్లకివై
నన్నే దాచెయ్ బంగరమయ్యి

ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా
ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్నే
 నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచులియ్యవానారింజ నీవై
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ ఆశలు తగ్గించనా తలదిళ్ళునేనై

ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగ గొట్టు విరహన్
నే
 
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

  

4 comments:

యే భాషైనా మనసుని ఉర్రూతలూపే సాంగ్..

https://www.youtube.com/watch?v=JsTTgIPCS7c

అవునండీ తమిళ్ లో కూడా సూపర్ హిట్ ఐన పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.



అవునండీ తమిళంలో
ను వురుకుల పరుగుల బోయెనుగదా సినిమా
చెవి రింగు రింగు మనుచున్
శివాణి ఉసిగొల్పు గాత్ర శింఘాణంబై :)

జిలేబి

పాటలలో పదాలకే కాకుండా కామెంట్స్ లో మాటలకు కూడా పద్యాలు కట్టేస్తున్నారా జిలేబి గారు బావుందండీ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.