ఆదివారం, ఫిబ్రవరి 04, 2018

నీతో సాయంత్రం...

అమ్మదొంగ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్మదొంగా! (1995)
సంగీతం : కోటి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర, శైలజ

నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం

ఓయమ్మో ఓవరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో

ఇదో రకం స్వయంవరం
త్రియంబకం ప్రియం ప్రియం
హో హో హో హో... హో హో హో...
హో హో హో హో... హో హో హో...


నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం

 
నీ జంట కోరే సాయంత్రము
నా ఒంటి పేరే సౌందర్యము
ఆ వేళ కొస్తే ఓ ఆమని కౌగిళ్ళలకిచ్చా నా ప్రేమని

ఆ రాధ గోలేమో రాగం తీసే
ఈ రాస లీలేమో ప్రాణం తీసే
తగువే ఆనందం ఐనా పరువే గోవిందం
యమగుండం ఇతగాడే బతికుంటే జతగాడే
చలి చుక్కల గిలిగింతలు
పులకింతకు నిను పిలిచెలె
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం


నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం

మేనత్త కొడకా ఇది మేనక
మరుజన్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటే నీ ఊర్వశి
నీ కెందుకంట ఈ రాక్షసి

మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి
నేనెళ్ళనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం తార సఖితో సవాసం
మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దెల విందే
నిదరోయిన తొలిజన్మల సోదలిప్పుడు పొదలడిగెలే


నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం

ఓయమ్మో ఓవరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో

ఇదో రకం స్వయంవరం
త్రియంబకం ప్రియం ప్రియం
హో హో హో హో... హో హో హో...
హా హా హా హా... హా హా హా...

 

2 comments:

హాంటింగ్ బీట్ ఓరియెంటెడ్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.