శనివారం, ఫిబ్రవరి 03, 2018

పచ్చగడ్డి కోసేటి...

దసరా బుల్లోడు చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దసరా బుల్లోడు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా

కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
అహ..కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా

కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి
చెప్పలేని ఊసులేవొ చెప్పుచున్నవీ
కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి
చెప్పలేని ఊసులేవొ చెప్పుచున్నవీ

ఊసులన్ని వింటివా ఊరుకోవవీ
ఆశలై బాసలై అంటుకుంటవి
ఊసులన్ని వింటివా ఊరుకోవవీ
ఆశలై బాసలై అంటుకుంటవి

హేయ్.. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ.. కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా

వరిచేను కోతకొచ్చి వంగుతున్నదీ
వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవీ
వరిచేను కోతకొచ్చి వంగుతున్నదీ
వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవీ

వయసుతోటి మనసేమొ పోరుతున్నదీ
వయసుతోటి మనసేమొ పోరుతున్నదీ
వలపులోనే రెంటికీ ఒద్దికున్నదీ
వలపులోనే రెంటికీ ఒద్దికున్నదీ

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ . . కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా

కొడవలితో లేత గడ్డి కోసుకుంటివీ
కొంటె చూపుతో గుండె దూసుకుంటివీ
కొడవలితో లేత గడ్డి కోసుకుంటివీ
కొంటె చూపుతో గుండె దూసుకుంటివీ

గడ్డిమోపు తలపైనా మోసుకొస్తినీ
గడుసువాణ్ణి తలపుల్లో దాచుకొంటినీ
గడ్డిమోపు తలపైనా మోసుకొస్తినీ
గడుసువాణ్ణి తలపుల్లో దాచుకొంటినీ

ఆహా.. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
హా . . కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా 


2 comments:

హీరోల స్టెప్పులకి శ్రీకారం ఈ సూపర్ డూపర్ హిట్టు సినీమాతోనే అంటారు మరి..

అవునా శాంతి గారు.. ఆవిషయం వినలేదు కానీ స్టెప్పులకి శ్రీకారం చుట్టినది అక్కినేని గారే అనేదాంట్లో మాత్రం ఏ సందేహం లేదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.