బుధవారం, డిసెంబర్ 30, 2015

గోవిందుడే కోక చుట్టి...

కీరవాణి స్వరసారధ్యంలో వచ్చిన ఓ కమ్మని కన్నయ్య గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పాండురంగడు (2008)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేదవ్యాస్
గానం : సునీత, కీరవాణి, మధు బాలకృష్ణ, బృందం

గోపాల బాలకృష్ణ గోకులాష్టమీ
ఆబాల గోపాల పుణ్యాల పున్నమి 
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని 
నంద నందనుడు నడచినచోటే నవ నందనవనీ..

గోపికా ప్రియ కృష్ణహరే 
నమో కోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే 
నమో వేదాంగ దివ్యా కృష్ణ హరే 

ఆఆఆ.. ఆఆఆఆ....
గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా
గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా
నవ మోహన జీవన వరమిచ్చెనమ్మా
ఇకపై ఇంకెపుడు నీ చేయివిడిచి వెళ్లనని
చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా

దేవకీవసుదేవ పుత్ర హరే 
నమో పద్మ పత్రనేత్ర కృష్ణహరే
యదుకుల నందన కృష్ణహరే 
నమో యశోద నందన కృష్ణహరే 

ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చేనమ్మా .
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చేనమ్మా
వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి
వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి
వెండివెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా
కళ్యాణ రాగ మురళి కళలు చిలికినమ్మా
మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా

గోవర్ధనోద్దార కృష్ణహరే 
నమో గోపాల భూపాల కృష్ణహరే 
గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 

తప్పటడుగు తాండవాలు చేసెనాడమ్మా
తన అడుగుల ముగ్గులు చూసి మురిసి నాడమ్మా
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన తప్పటడుగులు సరి దిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిసిమెరిసేనమ్మా
కలకాల భాగ్యాలు కలిసోచ్చేనమ్మా
హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా
శ్రీ పాదం ఉన్నచోట సిరులు విరుయునమ్మా

ఆపదోద్దారక కృష్ణహరే 
నమో ఆనంద వర్ధక కృష్ణహరే 
లీలా మానుష కృష్ణహరే 
నమో ప్రాణ విలాస కృష్ణహరే 

ఆపదోద్దారక కృష్ణహరే 
నమో ఆనంద వర్ధక కృష్ణహరే 
లీలా మానుష కృష్ణహరే 
నమో ప్రాణ విలాస కృష్ణహరే 

గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 
గోవర్ధనోద్దార కృష్ణహరే 
నమో గోపాల భూపాల కృష్ణహరే 

గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 
గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.