గురువారం, డిసెంబర్ 17, 2015

కొనుమిదే కుసుమాంజలీ...

ఈ రోజు నుండీ ధనుర్మాసం మొదలు కదా ఈ నెల రోజులూ ఆ కన్నయ్యను ప్రతిరోజు తలచుకుంటూ ఆయనపాటలే విందాం ముందుగా శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని ఈ చక్కని పాటతొ మొదలుపెడదామా మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రల రాఘవాచార్య(సీనియర్)
గానం : పి.సుశీల

కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
కొనుమిదే కుసుమాంజలి
రసికా నటలోక సార్వభౌమ
నాదలోల విజయగోపాల
కొనుమిదే కుసుమాంజలి

కాళీయ ఫణిరాజు పడగలపైనా
కాలియందియలు ఘల్లుమనా
లీలా నాట్యము చేసి చూపినా
లీలా నాట్యము చేసి చూపినా
తాండవ కృష్ణా జోహార్ జోహార్

కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
కొనుమిదే కుసుమాంజలి


నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
రారా మదిని వగదీర మరులు నెరవేర
మనసు తనివార కౌగిలి వీర
నెరా దొరా మాపై నెనరు గొనర
మారుకేళి దేలుపు మను మగువల
మహానందమయ మలయోల్లాస గతులా
దివ్య రాస కేళి మహిమ జూపి మురియజేసి
నిదవధి సుఖమొసగిన ఘనశ్యామ
సత్యభామ పరంధామ

కొనుమిదే కుసుమాంజలీ
అమరులా ప్రణయాంజలీ
కొనుమిదే కుసుమాంజలీ 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.