శుక్రవారం, డిసెంబర్ 18, 2015

అనరాదే బాలా...

ఆ కన్నయ్య చేసిన అల్లరి చూడాలంటే శ్రీకృష్ణవిజయం చిత్రంలోని ఈ పాట వినాల్సిందే.. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణవిజయము (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : ఘంటసాల,జయలలిత

అనరాదే బాలా..కాదనరాదే బేలా
ఆ.ఆ..అనరాదే బాలా..కాదనరాదే బేలా
కొమ్ములు తిరిగిన మగరాయుడు
నిన్ను కోరి కోరి పెళ్ళాడెదనంటే

అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆ
ఏమ్..అంటే..ఏమ్

అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు
అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు
ఇక నీవాడింది ఆట..పాడింది పాట సరిసరిగ తీరు ఉబలాట

అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ

మరీ..వాడో 
వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల
వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల
నా మాట విని..అవుననుము
ఆ పైని వేడుక..కనుగొనుమూ

అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ

అహ..హ హ హ హ ఓ ఓ ఓ హో..
ఆగుము..ఇది అంగ రంగ వైభోగము 
అనుమానమింక విడనాడుము..ఇటు చూడుము
మురిపాలు మీర సరదాలు తీర
జిగిగా బిగిగా నగుమా..పక పక పక
హ హ హ హ హ హ హ హ హ

అనరాదే బాలా..కాదనరాదే బేలా
కొమ్ములు తిరిగిన మగరాయుడుని
నిను కోరి కోరి..పెళ్ళాడెదనంటే
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ   


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.