సోమవారం, డిసెంబర్ 14, 2015

మేఘాలు లేకున్నా...

దేవీశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఒక మంచి మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో టీజర్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కుమారి 21F (2015)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి(పల్లవి), అనంతశ్రీరాం
గానం : యాజిన్ నిజార్

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే
అది నీ అల్లరేనా..
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీ వల్లేనా

కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ..

మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచేప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ.. మన మద్య దారంకైన దారి ఎందుకంటా

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ.ఉ.ఓ..

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.