శ్రీకృష్ణాంజనేయ యుద్దం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
నీవైన చెప్పవే ఓ మురళీ..
ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ
నీవైన చెప్పవే ఓ మురళీ
అడుగడుగున నా ప్రియభామినికి
అలుక ఎందుకని.. ఎందుకని
నీవైన చెప్పవే ఓ మురళీ
నీవైన చెప్పవే జాబిలీ
ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ
నీవైన చెప్పవే జాబిలీ
తలబంతి ఎవరో పదదాసి ఎవరో
తెలుసుకొమ్మనీ పిదప రమ్మనీ
నీవైన చెప్పవే జాబిలీ
అలుకలోన నా చెలియ వదనము
అరుణ కమలమై విరిసెననీ
అలుకలోన నా చెలియ వదనము
అరుణ కమలమై విరిసెననీ
ఆ కమలములోని తేనియలానగ
కమలములోని తేనియలానగ
నామది భ్రమరమై ఎగసెననీ
నీవైన చెప్పవే ఓ మురళీ
కోటిపూలతో కులుకు తుమ్మెదకు
ఈ తోటలో చొటులేదనీ
కోటిపూలతో కులుకు తుమ్మెదకు
ఈ తోటలో చొటులేదనీ
మనసెరిగిన సత్యా విధేయునికే
మనసెరిగిన సత్యా విధేయునికే
అనురాగ మధువు అందుననీ
నీవైన చెప్పవే జాబిలీ
ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ
నీవైన చెప్పవే జాబిలీ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.