గురువారం, డిసెంబర్ 10, 2015

ఈ వేళలో నీవు...

గులాబి చిత్రం కోసం సునీత గానం చేసిన ఓ మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం: గులాబి (1996)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సునీత

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ
 
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
 
 నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవూ
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేమీ కనిపించనంటోంది 
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
 
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు.. నవ్వుకుంటావు 

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ ఊహూ..హూ..హూహూ..


3 comments:

సూపర్ సాంగ్

ఎవర్ గ్రీన్ సాంగ్ మల్లిఖార్జున్ గారు థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.