ఇటీవల విడుదలైన తను నేను చిత్రంలోనీ ఓ మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తను నేను (2015)
సంగీతం : సన్నీ ఎమ్.ఆర్.
సాహిత్యం : వాసు వలబోజు
గానం : అరిజిత్ సింగ్, హర్షిక
సూర్యుడ్నే చూసొద్దామా నువ్వూ నేనూ
నీరే కొంచెం పోసీ హాయ్..
చంద్రుడ్నే తాకొద్దామా వెన్నెల్నే మొత్తం
కోసీ లోకం మొత్తం పంచేద్దాం..
గాలుల్లో తేలనీ ఆకాశం అందనీ
మేఘాలే పట్టి పొర్లించి వానల్లే చేద్దాం
నేలంతా ప్రేమే పండిద్దాం..
చుక్కల్నె తెంపి విత్తల్లే నాటేసీ చూద్దాం..
తారల్నే మొత్తం నేలంతా పోయిద్దాం
నదిలోనా కడవల్లే మునగాలి తడవాలి
ప్రతిరోజూ ఒక ఆటా గుర్తుండేలా ఆడేయాలి
చేజారి చెడకుండా నిముషాలే గడపాలి
బ్రతుకంటే భయమంటూ
ఆలోచించే ముందే నువ్ మారాలి..
ఓఓ.. నీతోడే నీవే.. ఓఓ.. ఏదో చేసేయ్..
చిందేసే ఈడే కదా అందర్లో చిందేయాలీ
సిగ్గంటూ ఓ మాటంటే లైఫే కాదే
నవ్వాలి నవ్వించాలి స్నేహాలే పూయించాలి
ఈడే పోతే మళ్ళీ రాదే
ఇంతేలే జీవితం.. ఇంతేలె జీవితం..
మేఘాలే పట్టి పొర్లించి వానల్లే చేద్దాం
నేలంతా ప్రేమే పండిద్దాం..
చుక్కల్నె తెంపి విత్తల్లే నాటేసీ చూద్దాం..
తారల్నే మొత్తం నేలంతా పోయిద్దాం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.