సోమవారం, డిసెంబర్ 21, 2015

చక్కనివాడే / చూడుమదే...

మిత్రులందరకూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే ఈ పర్వదినాన ఆ చిన్ని కన్నయ్య అల్లరులను వర్ణిస్తూ గానం చేసిన ఈ పాట విందామ. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : యశోదకృష్ణ (1975)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల 

చక్కని వాడే బలె టక్కరివాడే
చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే?
చక్కని వాడే బలె టక్కరివాడే

కొంటెకాయ పిల్లలను కూర్చుకున్నాడూ
గోకులమ్ములో చల్లగ దూరుకున్నాడూ
పాలుపెరుగు దించుకొని జతగాళ్ళతో పంచుకొని
పాలుపెరుగు దించుకొని జతగాళ్ళతో పంచుకొని
దొంగలాగ వెన్నముద్దలు మ్రింగి పొయ్యాడూ 
 
చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

పడక మీద ఆలుమగల ప్రక్కనే చేరాడు
గడ్డానికి సిగకూ ముడి గట్టిగ కట్టేశాడు
చాటునుండి ఈలవేసి చప్పట్లూ చరిచాడు
పట్టబోతే దొరక్కుండ గుట్టుగ దాక్కున్నాడు 

చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

కోడలి బుగ్గమీద గోరు గాట్లు పెట్టాడు
అత్తకు సైగచేసి వ్రేలు  పెట్టి చూపాడు
జుట్లు జుట్లు పట్టి గట్టి కేకపెట్టి
తిట్లు తిట్టుకోని కొట్లాడుతుంటే
ఇరుగు పొరుగు వాళ్ళ బిలిచి ఎకసక్కాలాడేడు    

చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే

దూడల మెడ పలుపు విప్పి ఆవుల కడ వదిలాడు
స్నానమాడు పడుచుల దడిసందున గని నవ్వాడు
దేవుని పూజలు చేస్తూ నైవేద్యం పెడుతుంటే
నేనే దేవుడనంటూ నోటి నిండ పటాడు
 
చక్కని వాడే బలె టక్కరివాడే
యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే ?
చక్కని వాడే బలె టక్కరివాడే



~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌

ముక్కోటి ఏకాదశి సందర్భంగా విప్రనారాయణ చిత్రంలో మరో కన్నయ్య పాట తలచుకుందామా.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఏ.ఎమ్.రాజా 

చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా...


చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


మురళీ కృష్ణుని మోహన గీతికి
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
పరవశమైనవి లోకములే
విరబూసినవీ పొన్నలు పొగడలు
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళమెగసెను మలయానిలముల 
సోలెను యమునా...

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..

 
నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా...ఆఆ.అ.అ.ఆఅ...
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధామాధవ కేళీ నటనా..

చూడుమదే చెలియా..
కనుల చూడుమదే చెలియా..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.