గురువారం, డిసెంబర్ 03, 2015

చారడేసి కనులతో...

రహస్యం చిత్రం లోని ఓ మధుర గీతాన్ని నేడు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రహస్యం (1967)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను
గగనమంత మనసుతో కలుసుకో నన్ను
చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను

గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను
దోర దోర వయసుతో దోచుకో నన్ను 
గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను

మదనుడు నిన్ను గని పొదలో దాగెను..
ఆహా ఆహా ఆహహహ
చంద్రుడు నిన్ను గని చాటుగ ఆగెను..
ఓహో ఓహో ఓహొహొహహొ
మదనుడు నిన్ను గని పొదలో దాగెను..
చంద్రుడు నిన్ను గని చాటుగ ఆగెను..
ఈ మోహన రూపం ఎన్నాళ్ళు దాచేవు
ఇలాగే ఇలాగే నిలవాలి నీవు

చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను

పిల్ల తెమ్మెరలో నీ పిలులుపులు విన్నాను..
ఆ.ఆ.ఆ.ఆఅహహహ..
అణువు అణువున నీ అందాలు కన్నాను
ఓ..ఓ..ఓ..ఓహొహొహొ..
పిల్ల తెమ్మెరలో నీ పిలులుపులు విన్నాను
అణువు అణువున నీ అందాలు కన్నాను
ఏనాడొ నీలోనే లీనమై ఉన్నాను
ఏనాడొ నీలోనే లీనమై ఉన్నాను
ఇలాగే ఇలాగే నిలిచేను నేను

గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను
దోర దోర వయసుతో దోచుకో నన్ను 
చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను
ఆహాహహహ..ఆహాహాహాహా...


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.