శనివారం, డిసెంబర్ 12, 2015

మొట్ట మొదటి సారి...

ఇటీవల విడుదలైన భలె భలె మొగాడివోయ్ సినిమాలోని ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భలె భలె మొగాడివోయ్ (2015)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సచిన్ వారియర్, కోరస్

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

 
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..
హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా...
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా
నా స్వాశనాపే బంగరు బాణాలా...

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
మధు మంత్రం చవి చూస్తున్నా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
మర యంత్రం ఐపోతున్నా..
అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా...
నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా
అర చేతులందు మొలిచెను పూవనం
నీ వల్లనే చెలీ
నా గుండే లోతుల్లో
ఓ పాలపుంత పేలిన సంబరం...

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
కనురెప్పల దోచెలి చాచా
ఓ.. ఓ.. ఓ.. ఓ..
కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించా
మలి చూపున మనసిచ్చా
నిదురకి ఇక సెలవిచ్చా
నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వూంటావా నా తోడుగా..
 
స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

 
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.