ఆదివారం, డిసెంబర్ 06, 2015

ఎప్పుడూ మీ పాఠాలంటే...

అమ్మమాట చిత్రం కోసం సుశీల గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమ్మ మాట (1972)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : సినారె 
గానం : సుశీల

సర్.. సార్... సార్...
ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..
ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..

ఒకటీ ఒకటీ కలిపితే రెండు అది గణితం
మనసు మనసు కూడితే ఒకటే ఇది జీవితం
గిరి గీసుకుని ఉండాలంటాయి గ్రంథాలు
గిరి గీసుకుని ఉండాలంటాయి గ్రంథాలు
పురి విప్పుకుని ఎగరాలంటాయి అందాలు

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..

కళ్ళల్లో చూడండి కనిపించును మీనాలు
పెదవుల్లో చూడండి అగుపించును పగడాలు
దోసిలి నిండా దొరుకుతాయి దోర నవ్వుల ముత్యాలు
కన్నెమేనిలో ఉన్నాయి కన్నెమేనిలో ఉన్నాయి
ఈ భువిలో దొరకని రతనాలు

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..

రాధా మాధవ రాగ జీవనం ఒక బంధం
కలువ జాబిలి వింత కలయికే అనుబంధం
యుగ యుగాలకు మిగిలేదొకటే అనురాగం
యుగ యుగాలకు మిగిలేదొకటే అనురాగం
చెలి మనసెరిగిన చినవానిదేలే ఆనందం

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..
ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..


 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.