మంగళవారం, డిసెంబర్ 08, 2015

కొడితే కొట్టాలిరా...

మణిశర్మ సంగీతంలో వచ్చిన ఠాగూర్ సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

చిందే వెయ్యాలీ నటరాజు లాగ
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజు లాగ
మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ

చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటని నెరవెర్చేటందుకే
ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే
అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
పొందే ఫలాన్ని పంచివ్వాలీ
అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ
ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ


పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే...

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.