ఆదివారం, డిసెంబర్ 13, 2015

జత కలిసే జత కలిసే...

శ్రీమంతుడు చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీమంతుడు (2015)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సాగర్, సుచిత్ర 

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని  హృదయాలు
తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటుఏమో ఒక్కరే ఇద్దరు అయ్యారు
 
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు

ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు
  
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.