బుధవారం, డిసెంబర్ 02, 2015

పొరుగింటి దొరగారికి..

సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్రంలోని ఓ సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దేవదాసు (1974)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : ఆరుద్ర
గానం : బాలు,సుశీల

పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ

ఈ మదికి ఆ మదికి అడ్డుగోడలేదు
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ ఉంది
ఈ మదికి ఆ మదికి అడ్డుగోడలేదు
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ ఉంది
గోడ నడుమ ఒక మూయని తలుపు వుందిలే
ఆ తలుపు వెనుక రారమ్మని పిలుపు వుందిలే

పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ

ఎంత అణచినా మనసు అణగనన్నదీ
ఇంత వలపు ఇపుడిప్పుడే కూడదన్నదీ
ఎంత అణచినా మనసు అణగనన్నదీ
ఇంత వలపు ఇపుడిప్పుడే కూడదన్నదీ
అనురాగం ఆ జన్మకు అధికమైనచో
మన ఇద్దరి  ప్రేమకు మరుజన్మ వుందిలే

పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ

చదవేస్తే ఉన్నమతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువు ఎందుకూ
చదవేస్తే ఉన్నమతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువు ఎందుకూ
దొరవేషం వేసినా దుడుకుతనం పోదా.. ఏయ్
ఇంత ఎదిగిన నీలో పిరికితనం పోదా

పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ
ఇరుగింటి చినదానికి తగని మక్కువ
ఇద్దరికీ.. ఇద్దరికీ
కుదిరితే ఏమితక్కువ

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.