బుధవారం, డిసెంబర్ 16, 2015

ఏలేలో.. ఏలేలో..

త్రిపుర చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో ట్రైలర్ ఇక్కడ చూడచ్చు. 
 

చిత్రం : త్రిపుర (2015)
సంగీతం : కామ్రన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : ప్రణవి ఆచార్య

ఏలేలో.. ఏలేలో.. ఏడుగుర్రాలెక్కీ సూరీడొచ్చాడే
ఏలేలో.. ఏలేలో.. నన్నే లేలెమ్మంటూ సూదీ గుచ్చాడే
ఐనా ఇనా ఏమంత తొందర చెరిపాడే నిద్దుర 
ఐనా ఇనా వదిలేనా నన్ను నా కలా..
కంటిపాపై వెలుగు జోలాలవింటా
చంటిపాపై కలలా ఒళ్ళో బజ్జుంటా 

గువ్వగొంతై మోగుతుందీ సుప్రభాతాల రాగం 
పూలతోటై ఘుమ్మందీ పరిమళాలా పరాగం 
చూస్తూ చూస్తూ తిరుగుతుంది చుట్టూ కోలాహలం 
ఐనా ఐనా ఏ సందడి తెలియదే నా మాయ మనసుకి 
ఐనా ఐనా ఏమైనా నాకు దేనికీ  

కంటిపాపై వెలుగు జోలాలివింటా
చంటిపాపై కలలా ఒళ్ళో బజ్జుంటా

రాములోరి జేగంటా రారమ్మంటోంది త్వరగా 
పిల్లగాలి పల్లకీతో ఎదురు చూస్తూ ఉన్నదిగా 
నే కన్ను తెరిచి చూడకుంటే ఊరె తెల్లారదుగా 
ఐనా ఐనా నా లోకం నాదిగా నేనుంటా నేనుగా
ఐనా ఐనా నా ఇష్టం నాకు పండుగా

కంటిపాపై వెలుగు జోలాలి వింటా
చంటిపాపై కలలా ఒళ్ళో బజ్జుంటా 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.