పెండ్యాల గారి స్వరరచనలో దేవులపల్లి వారి ఓ అందమైన రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె
నల్ల మబ్బు మేని సొగసులూ
రోటను త్రాటను కట్టనులే
నందనందనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిత్రం : శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె ఇదిగో నీ తల్లీ
ఏదీ అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె
నల్ల మబ్బు మేని సొగసులూ
కుల్ల కమల నయనాలూ
నల్ల మబ్బు మేని సొగసులూ
కుల్ల కమల నయనాలూ
మల్లెపువ్వు చిరునవ్వులూ
ఏవీ మళ్ళీ మళ్ళీ
అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లే ఇదిగో నీ తల్లీ
ఏదీ అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ
రోటను త్రాటను కట్టనులే
చీటికి మాటికి కోపించనులే
రోటను త్రాటను కట్టనులే
చీటికి మాటికి కోపించనులే
ఉట్టిపై పాలూ మీగడలున్నవి
ఉట్టిపై పాలూ మీగడలున్నవి
ఓరపించమూ మురళీ ఉన్నవి
ఏదీ అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లే ఇదిగో నీ తల్లీ
ఏదీ అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ
నందనందనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నందనందనా ఓ గోపీ బృందావనా
గోవిందా నా ముందా నీ దాగుడు మూతలు
విందా నీకీ చిలిపి చేష్ఠలు
ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లే ఇదిగో నీ తల్లీ
ఏదీ అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ
2 comments:
very good song
థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.