శనివారం, డిసెంబర్ 05, 2015

పట్టి తెచ్చానులే...

ఆత్మబంధువు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పన లో వచ్చిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

మనసున సెగ యెగసే 

ఏ మాయో వెలుపల చలి కరిచే 
వయసుకు అదివరసా 
వరసైన పిల్లదానికది తెలుసా
మాపిటికి చలిమంటేస్తా.. కాచుకో కాసంతా
ఎందుకే నను ఎగదోస్తా.. అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నేపువ్వు కన్ను కోడితే తుమ్మెదకూ దొంగాటా
దోబూచిలే నీ ఆటా...ఊహూ..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని 

కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

పొద్దు ఉంది ముద్దులివ్వనా.. 

ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా.. 

చూశాక మూటకట్టి లెక్క చెప్పనా
నోటికి నూరైతేనే.. కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే.. కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరయింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంతా డూపు

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...1 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.