రాగలీల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాగలీల (1987)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళో ఇంకా ఈ దూరం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఈడుకన్నుగీటేనమ్మా
నీడ ముద్దులాడేనమ్మా
రేయి తెల్లవారేదాకా
జోల పాడుకోలేనమ్మా
ఏమి ఎద చాటోనమ్మా
ఎంత ఎడబాటోనమ్మా
మాటపొరపాటైపోతే
మానమే పోతుందమ్మా
వలపే వలలా చుట్టేసే
కలలే కనులు కట్టేసే
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
సొంత తోడు లేనే లేక
సొమ్మసిల్లి పోయేనమ్మా
సన్నజాజి పూతీగల్లే
సన్నగిల్లి పోయేనమ్మా
కౌగిలింత దాహాలన్నీ
గాలికారబోసేనమ్మ
పట్టలేని మోహాలెన్నో
పాటలల్లుకున్నానమ్మా
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళో ఇంకా ఈ దూరం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఈడుకన్నుగీటేనమ్మా
నీడ ముద్దులాడేనమ్మా
రేయి తెల్లవారేదాకా
జోల పాడుకోలేనమ్మా
ఏమి ఎద చాటోనమ్మా
ఎంత ఎడబాటోనమ్మా
మాటపొరపాటైపోతే
మానమే పోతుందమ్మా
వలపే వలలా చుట్టేసే
కలలే కనులు కట్టేసే
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
సొంత తోడు లేనే లేక
సొమ్మసిల్లి పోయేనమ్మా
సన్నజాజి పూతీగల్లే
సన్నగిల్లి పోయేనమ్మా
కౌగిలింత దాహాలన్నీ
గాలికారబోసేనమ్మ
పట్టలేని మోహాలెన్నో
పాటలల్లుకున్నానమ్మా
కలదో లేదో ఆ భాగ్యం
కలయో నిజమో సౌభాగ్యం
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళో ఇంకా ఈ దూరం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
4 comments:
శ్రీకాంత్ గారూ... నేను కోరిన పాట పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
ఈ సినిమా పేరు మీద విడుదలకు ముందు పెద్ద రచ్చ జరిగింది. ముందుగా అనుకున్న "రాసలీల" అన్న పదంలో ఎంతో బూతు ఉందని సెన్సారు వారి ఆరోపించినందువల్ల దాన్ని "రాగలీల" గా మార్చడం జరిగింది. జంధ్యాల గారి సున్నితమయిన హాస్య సన్నివేశాల కల్పనకు ఈ సినిమా పెద్ద ఉదాహరణ. ఎటొచ్చీ కథావస్తువు శృంగార సంబంధం అయినందువల్ల జనాల్లో అంతా పెద్దగా పోలేదు. ఇదే సినిమాని ఇంకొన్ని ఇంగ్లీషు సినిమాల సంఘటనలను కాపీ కొట్టి జంధ్యాల గారి శిష్యుడు ఇ.వి.వి. సత్యనారాయణ గారు "చిలక్కొట్టుడు" అన్న సినిమాని చేశారు.
ఇక ఈ పాట విషయానికొస్తే... రాజన్-నాగేంద్ర గార్లు... మొదటిసారిగా తెలుగు పాటల్లో కొంగలు ఎగురుతున్నప్పుడు వచ్చే రెక్కల చప్పుడుని ఒక శబ్దంగా ఉపయోగించారు. సుశీలమ్మ గారి గొంతు చాలా గమ్మత్తైన శబ్దాలను పలుకుతుంది.
"ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను"
అన్న చోట కొంత "నో" అన్న ధ్వని కూడా పలికినట్లు అనిపిస్తుంది "ను" బదులుగా.
...
ప్రేయసిగా తన మనసులో ఉన్న భావనని గనుక నిజ్జంగా చేబితే
నవ్వులపాలవుతానని సున్నితంగా చెప్తుంది
"మాటపొరపాటైపోతే
గౌరవం పోతుందమ్మా"
అలా వేటూరిగారు వ్రాయడం ఆయన హాస్యచతురతకు నిదర్శనం.
ఈ పాట గురించి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకున్నందుకు ధన్యవాదాలు భవాని ప్రసాద్ గారు. లిరిక్ టైప్ చేస్తూ "మాట పొరపాటైతే" లైన్ దగ్గర ఒక నిముషం నేనూ తడబడి సరిగానే విన్నానా అని రెండో సారి విన్న తర్వాత వేటూరి గారి చమత్కారం అర్ధమై నవ్వుకున్నానండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
యెప్పుడూ వినని పాట..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. సినిమా హిట్ కాకపోవడం వల్ల మరుగున పడిన పాటనుకుంటానండీ.. బావుంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.