బుధవారం, అక్టోబర్ 24, 2018

ఆడే పాడే పిల్లలం...

ప్రేమించు పెళ్ళాడు చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమించు పెళ్ళాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ

ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం
ఎండావాన పాపలం.. నెమలి కన్నులం
పాడే పాటే పూవై.. పూసేనమ్మా విరితోటా
ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం
ఎండావాన పాపలం.. నెమలి కన్నులం

చిగురులలోనా...ఆఆఆఆఆ....
చిగురులలోనా చేదులు మింగీ
తేనెలు చల్లే కోయిలా
బిరబిరలాడే ఎండను తాకీ
జున్నును పంచే మావిలా

కాలం లోకం కరిగే వేళా
ప్రాణం ఒకటై పలికే వేళా  
మధువై మనలో కరిగే వలపే
పెదవి చివర ఎదలు నిలుపు వేళా
ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం
ఎండావాన పాపలం..
నెమలీ కన్నులం

పదములు సోకీ..ఈఈఈ. హాఅ...
పదములు సోకీ పదములు పాడే
ఎండిన ఆకుల పాటలా
పచ్చని ఆకుల పారాణులతో
పండిన మావిడి తోటలా
స్వప్నం కానీ స్వర్గం దొరికే
శిల్పం కానీ అందం కదిలే
లయలూ హొయలూ ప్రియమై కలిసే
వయసు మనసునడుగుతున్న వేళా

ఆడే పాడే పిల్లలం..
మురళీ నవ్వులం
ఎండావాన పాపలం.. నెమలి కన్నులం
పాడే పాటే పూవై.. పూసేనమ్మా విరితోటా

ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం
ఎండావాన పాపలం..
నెమలి కన్నులం 


2 comments:

వంశీ..ఇళయరాజా..బాలుగారి కాంబినేషన్..ఇంకేం ఇంకేం ఇంకేం కావాలీ..

హహహహ బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.