శుక్రవారం, అక్టోబర్ 12, 2018

అమ్మా..అమ్మోరు తల్లో...

ఈ రోజు గాయత్రి దేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి నమస్కరించుకుంటూ అమ్మోరు చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్మోరు ( 2003)
సంగీతం : చక్రవర్తి/శ్రీ
సాహిత్యం : మల్లెమాల 
గానం : బాలు, బృందం

అమ్మా..ఆఆఆఆ.. అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
అమ్మా..అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
దుష్టశక్తులను ఖతం చేసే
పరాశక్తివి నువ్వేనంట

అమ్మా..అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో

నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు
నిత్యం యెలుగుతు ఉంటారంట
యేదాలన్ని నీ నాలుకపై
ఎపుడూ చిందులు యేస్తాయంట
నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు
నిత్యం యెలుగుతు ఉంటారంట
యేదాలన్ని నీ నాలుకపై
ఎపుడూ చిందులు యేస్తాయంట
నింగి నీకు గొడుగంట
నేల నీకు పీఠమంటా
నిను నమ్మినవాళ్ళ నోముల
పంటకు నారు నీరు నువ్వేనంట

అమ్మా..అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో

ఆఆ.. పడగలు ఎత్తిన పాముల మధ్య
పాలకు ఏడ్చే పాపలమమ్మా
జిత్తులమారి నక్కల మధ్య
దిక్కే తోచని దీనులవమ్మా
పడగలు ఎత్తిన పాముల మధ్య
పాలకు ఏడ్చే పాపలము
జిత్తులమారి నక్కల మధ్య
దిక్కే తోచని దీనులము
బ్రతుకు మాకు సుడిగుండం
ప్రతిరోజు ఆకలిగండం
గాలివానలో రెపరెపలాడే
దీపాలను నువ్వు కాపాడమ్మా

అమ్మా..అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో


2 comments:

అమ్మవారిగా రమ్యకృష్ణ, బేబీ సునయన అద్భుతం గా ఉంటారు..

అవునండీ.. ఇద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారీ సినిమాలో.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.