మంగళవారం, అక్టోబర్ 09, 2018

అయిగిరి నందిని...

శక్తి చిత్రంలోని మహిషాసుర మర్ధిని స్త్రోత్రం ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శక్తి (2011)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : మహిషాసురమర్ధిని స్త్రోత్రం
గానం : శ్రీ వర్ధిని

అయిగిరి నందిని నందిత మేదిని
విశ్వ వినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధిని వాసిని
విష్ణు విలాసిని జిష్ణునుతే

భగవతి హేశితి కంఠ కుటుంబిని
భూరి కుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే

సురవర వర్షిణి దుర్దర ధర్షిణి
దుర్ముఖ మర్షిణి హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి
కల్మష మోచని ఘోరరతే

దనుజని రోషిణి దుర్మద శోషిణి
దుఃఖ నివారిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ కదంబవన
ప్రియవాసవిలాసిని వాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ
శృంగ నిజాలయ మధ్యగతే

మధుమధురే మధుకైటభభంజని
కైటభభంజని రాసర తే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే 


4 comments:

రెండుకళ్లూ చాలటం లేదండీ..అద్భుతం గా ఉంది అమ్మవారి పిక్..

అవునండీ.. నాకు కూడా చాలా నచ్చేసింది ఈ పిక్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

వందనాలు తల్లీ .....
-------------------
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు

ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

థాంక్స్ ఫర్ ద కామెంట్ రాజారావు గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.