సోమవారం, అక్టోబర్ 29, 2018

కోలో కోలో కోయిలమ్మా...

నంబర్ వన్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నెంబర్ వన్ (1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోనా

తాకితే ఎర్రాని బుగ్గ కందాలా
మీటితే వయ్యారి వీణ థిల్లానా
కలికిచిలక వలపు చిలకగా
కలువచెలియ కలువ రమ్మనె
కిలకిలలో మురిపెములే అలలు అలలుగా
జల్లులై వెల్లువై పొంగిపోయే 

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

ఓ ప్రియా లాలించమంది వయ్యారం
మోజులే చెల్లించమంది మోమాటం

చిలిపిచూపు సొగసు నిమరగ
జాజితీగ జడకు అమరగ
గుసగుసలే ఏఏ ఘుమఘుమలై గుబులు రేపగా
ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా


2 comments:

సూపర స్టార్ కృష్ణకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన మూవీ..

అవును శాంతి గారు చాలా పెద్ద హిట్ కదా అప్పట్లో... థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.