శుక్రవారం, అక్టోబర్ 05, 2018

లోకమేలే అమ్మ...

భలే పెళ్ళాం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలేపెళ్ళాం (1994)
సంగీతం : దేవా 
సాహిత్యం : 
గానం : చిత్ర 

లోకమేలే అమ్మ గట్టుపోలేరమ్మ
దిక్కు నువ్వేనమ్మ ముద్ద పొంగళ్ళమ్మ
మూడు లోకాలమ్మ రావే నూకాలమ్మ
బంగారు మాయమ్మ కొంగు బంగారమ్మా
తెలప్రోలు రంగమ్మ తిరపతి వెంగమ్మ
కంకాళ అంకమ్మా కూళ్ళ గంగానమ్మ
కోనేటి పెద్దమ్మ రావె పెద్దింటమ్మ
కోనేరు పైడమ్మ నీదే మా ఒళ్ళమ్మ
కాశీ విశాలాక్షి కంచి విరూపాక్షి
కంచిలో కామాక్షి కాచుకో మీనాక్షి
అమ్మ అంకాళమ్మ గుమ్మ చెంగాళమ్మా
బెజవాడ కొండల్లో కనకదుర్గమ్మా
సమ్మక్క సారక్క గౌరక్క గండక్క
మా దిక్కు నీవమ్మ మా మొక్కు నీదమ్మ
పసుపు లీవమ్మా..

నిను తాళి వరం కోరుకున్నా పార్వతీ
సాటి దాన్ని నేనమ్మా సానుభూతి చూపమ్మా
పెనుగాలి పరం చేయకు నా హారతి
వేరు తల్లి లేదమ్మా వెన్నుతట్టు మాయమ్మా
మంచోళ్ళనే నేడు వంచించే దైవాలు మాగతి కనరే
తను కట్టిన తాళికి పెట్టిన పూలకి రక్షకులెవరే
మాలక్ష్మి గోత్రాలు మాంగళ్య సూత్రాలు
మా పంచ ప్రాణాలమ్మా

జాలి ఉంటే జోలె చూడవే
అమ్మా మాంగళ్యం దానమీయవే 
మనసున్న మాత నీవులే
అమ్మా మగనాలి రాత మార్చవే

నిను తాళి వరం కోరుకున్నా పార్వతీ
సాటి దాన్ని నేనమ్మా సానుభూతి చూపమ్మా

వీనులార విన్నకథ కన్నార చూడనిదే
వాదించు సాక్షి లేడమ్మా
నీ మూడు కళ్ళెదర నా వాడి మృత్యుచెర
విడిపించగలడొ చెప్పమ్మ
శోధనకు సోలిపోయి ఉన్నా జీవాలమ్మా
వాదనకు ఆత్మ సాక్షి వచ్చేదెట్టాగమ్మా
జన్మరాత బ్రహ్మ తప్పు రాస్తే దిక్కేదమ్మా
న్యాయమూర్తి తీర్పు దాని తప్పూ దిద్దాలమ్మా
నిర్దోషి దోషిగా మారేనమ్మా
ధర్మాన్ని గెలిపించి దయ చూడమ్మా

నల్గొండ నాగమ్మ చెండ చామాలమ్మా
కైకలూరున ఉన్న శ్యామలా మాయమ్మ
కర్నాట చౌడమ్మ కాచుకో కాశమ్మ
కావవే మారెమ్మ కన్యకుమారమ్మా
అమ్మా సావిత్రమ్మ చండీ గాయత్రమ్మ
పెద్దసిరి పెద్దమ్మ మద్దికెరి మద్దెమ్మ
ముడికల్లు గౌరమ్మ నడిపల్లి నారమ్మ
చీరాల సిద్దమ్మ పేరాల పెద్దమ్మ
ఒంగోలు ఓబమ్మ జొన్నాడ కాయమ్మ
తూటాల కోనలో తూచు లక్ష్మియమ్మ
మూకాంబికా రావె హేమాంబికా రావె
యోగాంబికా రావే నాగాంబికా
భైరవి భైరవి ఓంకార భైరవి
మనసున్న మార్గవి
మముగన్న శాంభవి
కాపాడవే వైష్ణవి

నాతాళి బొట్టు సిరి తల్లోన పూలసిరి
కాపాడే తల్లి నీవనీ
నీ పాద ధూళి మా పసుపు కుంకాలుగా
పండించుకుంటానమ్మా
భద్రకాళి రుద్రకాళి రగిలే జ్వాలవై
సత్యరక్ష ధర్మ రక్ష చేసే మార్గవై
కాలనాగు కప్పుకున్న మొగలి పూతవై
కాటువేసి కాటిలోకి పంపూ దూతవై
చెలరేగినప్పుడూ చెడు చావదా
తీర్చాలే తల్లి ఈ పెను ఆపదా

ఏర్చేరు చెంగమ్మ మళయాళ మంగమ్మ
జులపాల సరుపమ్మ జూకాల మల్లమ్మ
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
అంకాళమ్మా రావే రావే హేకాళమ్మ
రావే గంగానమ్మ దాసర కేసర మారమ్మ రావె
ఇందూరులో ఉన్న గంగమ్మమ్మా రావే
ప్రీతి కాపరిలోన కుక్కుటేశ్వరీ నీవే  
కాసులమ్మా నీవే జాబిలమ్మా నీవే
చిన్నదండిలో చినగంగమ్మా రావే
ఆలూరులో ఉన్న గంగాలమ్మా 
ఓం తల్లి మా తల్లి మా శక్తి జాబిల్లి
ఓచండి మా చండి కాపాడు తోడుండి
రక్షించు మాతాళినీ..

నిను తాళి వరం కోరుకున్నా పార్వతీ
సాటి దాన్ని నేనమ్మా సానుభూతి చూపమ్మా
పెనుగాలి పరం చేయకు నా హారతి
వేరు తల్లి లేదమ్మా వెన్నుతట్టు మాయమ్మా
మంచోళ్ళనే నేడు వంచించే దైవాలు మాగతి కనరే
తను కట్టిన తాళికి పెట్టిన పూలకి రక్షకులెవరే
మాలక్ష్మి గోత్రాలు మాంగళ్య సూత్రాలు
మా పంచ ప్రాణాలమ్మా

 


2 comments:

ఈ పిక్ అమ్మవారిది చాలా కొత్తగా ఉందండి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.