గురువారం, అక్టోబర్ 04, 2018

కలవాడైనా...

మహాచండి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహాచండి (2006)
సంగీతం : టి.రాజేందర్
సాహిత్యం :
గానం : చిత్ర

మహిమగలిగిన పసుపు కుంకుమ అందుకోండీ
మహిషాసుర మర్ధిని ముందర వేడుకోండీ
తల్లీ తల్లీ శరణం శరణం తాళిని కాచే తల్లీ శరణం
తల్లీ తల్లీ శరణం శరణం తాళిని కాచే తల్లీ శరణం


కలవాడైనా పతియేగా బీదోడైనా భర్తేగా
కలవాడైనా పతియేగా బీదోడైనా భర్తేగా

పూజలకొద్దీ ఫలం ఫలం ఆఆఆఅ....
పూజలకొద్దీ ఫలం ఫలం పడతికి భాగ్యం మాంగల్యం
పెద్దలు చెప్పే మాటలు ఎపుడూ పొల్లే పోలేదే
దేవుని నమ్మే మగువలకెపుడూ కష్టంరాలేదే

కలవాడైనా పతియేగా బీదోడైనా భర్తేగా
కలవాడైనా పతియేగా బీదోడైనా భర్తేగా

వనవాసం రామునికైనా వెనువెంటే సీతమ్ముంది
రామాయణం చెప్పే నీతి ఇది కథ ఏమిటే
భర్తే తన భార్యకి దైవం అని తెలుపుటే
అయోధ్యకీ రాముడు కనకే పతివెంటా సతి నడిచింది
అయోగ్యుడికి ఇల్లాలైతే అతనివెంట నడిచెళ్ళేదా
మేకతోలు కప్పిన పులిలా మగడుంటే విలువిచ్చేదా

మొగుడు మంచి వాడైతే దేవుడిచ్చిన వరమంటా
భర్తగనక చెడ్డోడైతే విధిరాతే తప్పని అంటా
ఫలమేదైనా విధిరాతే చెరగదు మనుషుల తలరాతే
ఫలమేదైనా విధిరాతే చెరగదు మనుషుల తలరాతే
బిడ్డా బిడ్డా తెలిసినదా దేవుడి మహిమలు మరిచితివా
దుష్టులు ఎన్నడు భర్తలు కారే
పాపాత్ములందరు పతులూ కారే
దుష్టులు ఎన్నడు భర్తలు కారే
పాపాత్ములందరు పతులూ కారే
నలుగురు చెప్పే ధర్మాలేఏఏఏఏ...ఆఆఆఆ...
నలుగురు చెప్పే ధర్మాలే అందరికెట్టా సరియగునే
మగడనువాడికి మాణిక్యమంటీ మనసుండాలమ్మా
పేదోడైనా సఖిమనసెరిగీ సుఖపెట్టాలమ్మా


దుష్టులు ఎన్నడు భర్తలు కారే
పాపాత్ములందరు పతులూ కారే

దుర్మార్గుడే భర్తగ వస్తే ఆ దేవుడు ఏం చెయగలడే
రక్షించాలి అని అనుకున్నా వధించక తప్పదులే
మాంగళ్యమడిగే సతికీ భిక్షపెట్ట వీలవదే

ఒకధర్మం నువ్వు చెప్పావు మరొక్కటి నేచెబుతాను
సతీ సుమతి మాటను దాటా సూర్యునికే వీలవలేదే
సావిత్రిని జయించలేక ఆ యముడే దిగివచ్చాడే
పతులు మంచివారైతే సతిపూజకు విలువుంటుందే
ఆ పతులే పాపులైతే దేవుడైన దయగొనలేడే

పసుపూ కుంకుమ మగువకు భాగ్యం వాటిని రక్షించేదే దైవం
పసుపూ కుంకుమ మగువకు భాగ్యం వాటిని రక్షించేదే దైవం
అమ్మా అమ్మా తెలిసినదా అబలల కష్టం తెలియనిదా..

కలవాడైనా పతియేగా బీదోడైనా భర్తేగా
కలవాడైనా పతియేగా బీదోడైనా భర్తేగా

మంగళదాయకి మాంగళ్య రూపిణి అమ్మా
కుంకుమలిచ్చే కమలలోచనీ రామ్మా
తల్లీ తల్లీ శరణం శరణం తాళిని కాచే తల్లీ శరణం
తల్లీ తల్లీ శరణం శరణం తాళిని కాచే తల్లీ శరణం
తల్లీ తల్లీ శరణం శరణం తాళిని కాచే తల్లీ శరణం


5 comments:

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

భక్తి పాటల సిరీస్ బావుందండీ...

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ రాజ్యలక్ష్మి గారు అండ్ స్వీటీ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.