గురువారం, జులై 21, 2016

మెల మెల్లగా చిగురించెనే...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కోసం రమణ గోగుల స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వెంకటాద్రిఎక్స్ ప్రెస్ (2013)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : శ్వేతా మోహన్, అంజనా సౌమ్య

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరుమల్లెలా వికసించెనే
ఎదలోతులో ఈ కలయికా

పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
పొగమంచును మీటినా కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వేనేనులా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ పులకించనా
నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

 

2 comments:

కొత్త మూవీస్ లోనూ గుడ్ మెలొడీస్ విత్ డీసెంట్ లిరిక్స్ ఉంటాయని ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు అనిపిస్తుంటుంది..

అవును శాంతి గారు అప్పుడప్పుడు మెరిపిస్తుంటారు ఇలాంటి సాంగ్స్ తొ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.