శుక్రవారం, జులై 29, 2016

నీ స్టైలే నాకిష్టం...

మణిశర్మ స్వరపరచిన రాఘవేంద్ర చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. పూర్తి పాట ఇక్కడ వినవచ్చు.


చిత్రం : రాఘవేంద్ర (2003)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : హరీష్ రాఘవేంద్ర, సుజాత

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నా పేరే

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలిగెలేరా
అందరీ తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక
నీ మగసిరి నడకలలోన
తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
పగలే కల కంటున్నావో
కలవరింతలో ఉన్నావో
ఊహ నుండి బయటకు రావమ్మో

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా
ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ
నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు
నీ కంటి బొమ్మల విరుపు
నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపే కలిపెరా
పూవంటి హృదయంలోన 
తేనంటిమనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహారే

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నా పేరే

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం

 

2 comments:

చల్లటి సాయంత్రం వినే ఫేవరెట్ సాంగ్స్ లో ఇదీ ఒకటండి..థాంక్స్ ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.