యువరాజు చిత్రం కోసం రమణ గోగుల స్వరపరచిన ఒక చక్కని మెలొడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : యువరాజు (2000)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర, రమణగోగుల
మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో
అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో
అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా
ఓహోహో...హో..ఓ..ఓఓ....ఓఓఓఓ....
ఆ… సరసం విరసం విరహం సరిగమ సంగీతం
ఆ… చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే
ఓహోహో...హో..ఓ..ఓఓ....ఓఓఓఓ....
మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
2 comments:
ప్రేమ చేసే మాయాజాలం లో యే అనుభూతైనా వేటూరి వారి కలానికి సుపరిచితమే..
నిజమేనండీ వేటూరి వారికి నమస్సులు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.