అహా నా పెళ్ళంట చిత్రం కోసం రఘుకుంచె స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అహనా పెళ్ళంట (2011)
సంగీతం : రఘుకుంచె
సాహిత్యం : సిరాశ్రీ
గానం : చిత్ర
నీకోసం.. నీకోసం..
నువ్వే నచ్చావు ప్రేమలా..
నాతో కలిసావు నీడలా..
నువ్వే నచ్చావు ప్రేమలా..
నాతో కలిసావు నీడలా..
మౌనమే దాటని మాటలే నీవని..
కన్నులే కలవని కలయికె నీవనీ..
ఏవేవొ అనుకుంటున్నా..
ఎన్నెన్నొ కనుగొంటున్నా..
పులకింతలోనే ఉంటున్నా..
పులకింతలోనే ఉంటున్నా..
ఎదరాగమే వింటున్నా..
కనుతెరచి కలగంటున్నా..
ఇది వింత సుఖమే అంటున్నా..
ఇది వింత సుఖమే అంటున్నా..
ఆ మురళి రవళిలో సరిగమలా
ఆ నిండు కడలిలో తొలి అలలా..
అర విచ్చుకున్న పూవనిలా..
ఆ నింగినున్న చిరు తారకలా..
నీ చెలిమి కనిపిస్తూ ఉంది..
అని నాకు అనిపిస్తు ఉంది.
2 comments:
అల్లరి నరేష్ మూవీస్ ని సాంగ్స్ కంటే యెంటర్టైన్మెంట్ కోసమే యెప్పుడూ చూస్తామండి..బట్ ఈ పాట విన్నప్పుడు అరే భలే బావుందీ సాంగ్ అనుకున్నాము..రఘు కుంచే నా మ్యూజిక్..గుడ్ సాంగ్..
రఘుకుంచె కొన్ని మంచి మంచి పాటలు ఇచ్చాడండీ.. అవును నరేష్ సినిమాలో పాటల రేంజ్ కి ఇది మంచి మెలోడీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.