బుధవారం, జులై 13, 2016

వచ్చిందా మేఘం...

యువ చిత్రం కోసం ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.పూర్తిపాట ఆడియో యూట్యూబ్ ఇక్కడ.


చిత్రం : యువ (2004)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : అద్నాన్ సమీ, సుజాత

ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు...
ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా..
వచ్చిందా మేఘం...రానీ
పుట్టిందా వేడి...పోనీ
తెచ్చిందా జల్లు...తేనీ మనమేం చేస్తాం
ఆ..వచ్చిందా...దారి...రానీ
అదిపోయే చోటికి..పోనీ
మలుపోస్తే మారదు...దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
మనమేం చేస్తాం.. 
మనమేం చేస్తాం..

రాళ్ళను కూడా పూజిస్తారు
అవి దార్లో వుంటే ఏరేస్తారు
దారప్పోగు నాజూకైనా
పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతా చిక్కే
అర్ధం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్
సరేలే నీకు నాకు ఎవరున్నారు

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా

వచ్చిందా మేఘం...రానీ
పుట్టిందా వేడి...పోనీ
తెచ్చిందా జల్లు...తేనీ మనమేం చేస్తాం
ఆ..వచ్చిందా...దారి...రానీ
అదిపోయే చోటికి..పోనీ
మలుపోస్తే మారదు...దారి మనమేం చేస్తాం

కడలింట కలిసే నదులు
ఒకటైనా పేర్లే మారు
పూవుల్లో దాచిందెవరో
పులకించేటి గంధాలన్నీ
ఏ కొందరి అడుగుజాడలో
నేల మీద అచ్చౌతాయి
ఈ నీడలా చీకటి పడినా
ఆ జాడలు చేరిగిపోవోయి

ఎయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు...
ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా..
వచ్చిందా మేఘం...రానీ
పుట్టిందా వేడి...పోనీ
తెచ్చిందా జల్లు...తేనీ మనమేం చేస్తాం
ఆ..వచ్చిందా...దారి...రానీ
అదిపోయే చోటికి..పోనీ
మలుపోస్తే మారదు...దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా 
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా 

 

6 comments:

వన్ ఆఫ్ మై ఫేవరెట్స్..ఈ పాట అద్నాన్ సామీ పాడట వల్లేమో ప్రతీ పదం పియానో పలికించినట్టే అనిపిస్తుంది..

నిజమేనండీ తన గొంతులో మరీ ప్రత్యేకంగా ఉంటుందీ పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్..

రాళ్ళను కూడా పూజిస్తారు
అవి దార్లో వుంటే ఏరేస్తారు

Super lines

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్...

Thanks for ur lyrics andi.... Chaalaa baa raasaaru two colours petti... Thanks a lot for the lyrics... In telugu

థ్యాంక్స్ రామ్ కుమార్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.