బుధవారం, జులై 27, 2016

పాడనా వేణువునై...

సత్యం గారి స్వరకల్పనలొ వేటూరి వారు రచించిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సుందరి సుబ్బారావ్ (1984)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి(ఆలాపన)

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై
పాడనా వేణువునై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో

పాడనా వేణువునై  నీవు నా ప్రాణమై

చెలీ! సఖీ! ప్రియే! చారుశీలే! అనీ..
తలచి తనువు మరచి కలలు కన్నానులే
కాముడిలా సుమ బాణాలు వేసి
కదిలిన నీ చలి కోణాలు చూసి
ఆమనిలో సుమ గంధాలు పూసి
కవితలుగా నవ వేదాలు రాసి
మోవికి తగిలి ముద్దుల మురళి
కౌగిళ్ళలో ప్రియ కళ్యాణిలో
సంగీతమే పాడిందిలే

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై

కలం..గళం..స్వరం నాకు నీవేననీ
మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే
నీలో అలిగే అందాల రూపం
నాలో వెలిగే శృంగార దీపం
నీలో కరిగే ఆ ఇంద్ర చాపం
నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే వెన్నెల చినుకై
రమ్మందిలే మనసిమ్మందిలే
నీ రాగమే పాడిందిలే

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై

2 comments:

పాటల బృందావనం లో "వేణు"వై..ఇంత అందమైన పాటలు ప్రెజెంట్ చేస్తున్నందుకు అందుకోండి మా నించి బోలెడు థాంక్యూలు ..

మీ అందమైన వ్యాఖ్య నాకు చాలా సంతోషాన్నిచ్చిందండీ. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్ కి ధన్యవాదాలు శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.