బుధవారం, జులై 20, 2016

చిటికెయ్యవే చినదానా..

రాధాకళ్యాణం చిత్రం కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. 


చిత్రం : రాధా కళ్యాణం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఫాలఘాట్ మాధవన్.. పాటంటే ధనాధన్..
మదరాశి మాధవన్.. మాటంటే ఝణాఝన్
నా.. చాన్స్ దొరికితే కానా.. ఆ.. ఆ..
మ మ మ మ.. మహదేవన్..

చిటికెయ్యవే చినదానా.. చిందెయ్యవే తందానా
చిటికెయ్యవే చినదానా.. చిందెయ్యవే తందానా
నీ చిటికెల చినుకుల చిత్తుగా తడిసి
పూటకొక్క పాటకట్టి.. పాటతోనె కోటకట్టి..
కోటలోన నిన్నుపెట్టి
చిటికెయ్యవే చినదానా.. చిందెయ్యవే తందానా

పనిపమ... రిమపనిపమ..
రిమపని పమ మపమరి రిమరిస రిపమప
మెత్తగా పదమెత్తగా..
కుసుమించిన అందెల గుండెలు ఘల్లనా
మపమరి సరిమపమరి
నిస రిసమరి మపనిప మరిరిస సనినిసప
ఆడగా.. నడుమాడగా..
జడ వంపు మరో మరుడెత్తిన విల్లనగా
సుస్వర భాస్వర సురుచిర లయఝరిగా..
సనిపమ రిసనిపని

హా.. చిటికెయ్యవే చినదానా.. చిందెయ్యవే తందానా

కొప్పులోని జాజిపూలు
ఘుమఘుమలే మా సరిగమలన్నాయి
గుండెలోని పొంగులేమో
గుసగుసలే మా పల్లవులన్నాయి

కొప్పులోని జాజిపూలు
ఘుమఘుమలే మా సరిగమలన్నాయి
గుండెలోని పొంగులేమో
గుసగుసలే మా పల్లవులన్నాయి

తకధిమి అంటూ ఆడే అడుగులు
తామే చరణాలన్నాయి
ఎదలో తీయని కదలికలేమో
మృదంగ నాదాలన్నాయి

ఓరి మాధవా.. ఆ.. ఓరి మాధవా..
నా అణువణువున కేరళ గీతాలున్నాయి
కేరళ గీతాలున్నాయి.. కేరళ గీతాలున్నాయి

లలలాలల లలలాల..
లలలాలల లలలాల
లలలాలల లలలాల..
ఉహుహుహు.. ఉహుహు.. 


2 comments:

భలే పాట..భలే పిక్ అండి..

అవునండీ నాకూ చాలా ఇష్టం.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.