ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం చిత్రంలోని ఓ చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం : చక్రి
సాహిత్యం : చంద్రబోస్
గానం : హరిహరన్, కౌసల్య
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జువ్వా... జువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే
పొంగే పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే
తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం
కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ
జారిపోకే జవరాలా
నీలి సంద్రమున అలలాగా
హృదయ లోగిలిలో నువ్వా..
నువ్వా..నువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
క్రుంగెను ఎద నీ కోసమే
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
క్రుంగెను ఎద నీ కోసమే
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా
తగిలెను నీ మృదు పాదమే
ఎగిసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ
తడిపిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగా
నయన చిత్తడిలో నువ్వా
నువ్వా..నువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జువ్వా... జువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
2 comments:
ఈ అమ్మాయి(తనూ రాయ్) చక్కగా ఉంటుంది..అవకాశలు రాకేమో మరి, ఆ తరువాత చెప్పుకోదగ్గ పాత్రలేవీ చేయలెదనిపిస్తుంది..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.