లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం : మిక్కీ జె.మేయర్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : కె.కె.
అహ అహ అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం
లే అని లేలే అని...
జిల్లుమని చల్లని పవనం
ఆ వెనకే వెచ్చని కిరణం
అందరిని తరిమెను త్వరగా
రమ్మని రా రమ్మని
వేకువే వేచిన వేళలో
లోకమే కోకిలై పాడుతుంది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
అహ అహ అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం
లే అని లేలే అని...
రోజంతా అంతా చేరి సాగించేటి
చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్దోళ్లే ఇంటా బయటా
మాపై విసిరే చిన్ని విసురులు
కొన్ని కసురులు
ఎండైనా వానైనా ఏం తేడాలేదు
ఆగవండి మా కుప్పిగంతులు
కోరికలు నవ్వులు బాధలు
సందడులు సంతోషాలు
పంచుకోమన్నది
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
సాయంత్రం అయితే చాలు
చిన్నా పెద్దా రోడ్డు మీదనే
హస్కు వేయడం
దీవాలీ హోలీ క్రిస్టమస్ భేదం లేదు
పండగంటే పందిళ్లు వేయటం
ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా
మమ్ము చేరనేలేదు ఏ క్షణం
మా ప్రపంచం ఇది మాదిది
ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది
ఈ రంగుల రంగుల రంగుల జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
4 comments:
Yes - Life is Beautiful 😀
బ్యూటిఫుల్ సాంగ్..
ఎస్ శాంతి గారు బ్యూటిఫుల్ సాంగ్ :-)
Thanks అజ్ఞాత గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.