సోమవారం, జులై 25, 2016

ఏరువాక సాగుతుండగా...

ఒకేఒక్కడు చిత్రం కోసం రహ్మన్ స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఒకే క్కడు (1999)
సంగీతం : ఎ ఆర్ రెహ్మాన్
రచన : ఎ. ఎం.రత్నం, శివగణేశ్.
గానం : స్వర్ణలత, శ్రీనివాస్.

ఎలేలే... ఏ... ఏ... ఏలేలే... ఏ...
ఏరువాక సాగుతుండగా
చెట్టు పైరగాలి వీస్తుండగా
నే నేరు దాటి అయ్యకేమో
సద్దికూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు
చూసి నేను మురిసిపోయా

ఒకవైపు కన్నదిరే
మరువైపు మేనదిరే
వీధుల్లో నిండిన కుండలు
మ్రోగెను గంటలు ఏలనో
ఒక పూలమ్మి ఎదురొచ్చె
పాడి ఆవొకటి కనిపించె
ఇక ఏమౌతుందో ఏటౌతుందో
ఈ చిన్నదాన్ని దైవం మెచ్చి
వరమిచ్చునో

సొంపైన సంపంగి
నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడుగట్టి
చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే
నన్ను వీడి పోవు వయసు


 

2 comments:

ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది..యెపార్ట్ ఫ్రం నెల్లూరి నెరజాణా..థాంక్స్ ఫర్ పోస్టింగ్..

చిన్న బిట్ సాంగే అయినా మనసులొ ముద్ర పడిపొతుందండీ.. నాక్కూడా ఇష్టమీపాట. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.