మంగళవారం, జులై 05, 2016

తొలి తొలి బిడియాలా...

ఇందిర చిత్రంలోని ఒక మంచి మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇందిర (1996)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
రచన : సిరివెన్నెల
గానం : బాలు, చిత్

తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవాశాన పసి పరువానా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవాశాన పసి పరువానా

తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా

చిన్నదాని వయసే చెంత చేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా

ఆశల తీరాన మోజులు తీర్చెయ్ నా
హద్దు మరి తెంచేస్తే యవ్వనం ఆగేనా

తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
నరముల వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా

మధువులు కురిసే.. పెదవుల కొరకే
ఇరవై వసంతాలు వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలు దాచుకున్నా
ఇకపైన మన జంట కలనైన విడరాదే
మరీ కొంటె కల వెంట కన్నె ఎద తేల రాదే

తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవాశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా

 


4 comments:

నైస్ సాంగ్..

అవును శాంతి గారు చాలా మంచి పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్..

ఇందిర చిత్రంలో పాటలన్నీ సిరివెన్నెల అని గుర్తు! ఇది వేటూరిది కాదేమో!

నిజమేనండీ ఇందిరకి సిరివెన్నెల గారిది సింగిల్ కార్డ్.. డబ్బింగ్ కదా వేటూరి గారు కూడా రాసుంటారేమో అని చెక్ చేయలేదండీ.. థాంక్స్ ఫర్ ద కరెక్షన్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.